Vijay Antony 's Dr Salim Telugu Movie Set to Release in February 1st week.

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సురేష్ కొండేటి మాట్లాడుతూ – “ఈ చిత్రానికి సంబంధించిన డైలాగులతో పాటు ఐదు పాటలను సాహితి రాశారు. పాటలన్నీ స్వరాలపరంగానే కాదు.. సాహిత్యం పరంగా కూడా బాగుంటాయి. ఈ పాటలను హేమచంద్ర, సుప్రియా జోష్, మహాలింగం, ప్రభు, సంతోష్ తదితరులు పాడారు. ఈ చిత్రం మంచి మ్యూజికల్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. సరిగమ ఆడియో సంస్థ ద్వారా ఈ పాటలను విడుదల చేయబోతున్నాం. హీరోగా నటించడంతో పాటు విజయ్ ఆంటోని మంచి పాటలు స్వరపరిచారు. ఆయన నటన హైలైట్ గా నిలుస్తుంది. మా ఎస్.కె. పిక్చర్స్ నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల జాబితాలో ఈ చిత్రం చేరుతుంది” అని చెప్పారు.
ఈ చిత్రానికి సహనిర్మాత: ఎం. అర్జున్ గౌడ్. దర్శకత్వం: ఎన్.వి. నిర్మల్ కుమార్. సంగీతం: విజయం ఆంటోని.